రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
WGL: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన ఘటన వరంగల్- నర్సంపేట జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. నర్సంపేట వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది