VIDEO: బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి
శ్రీకాకుళం రోడ్డు నుంచి నూతనంగా ప్రారంభం కానున్న తిరుపతి హంస ఫర్ ట్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం శ్రీకాకుళం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ శ్రీకాకుళం పట్టణం నుంచి ఆమదలవలస రైల్వే స్టేషన్ రోడ్డు వరకు సాగింది. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.