VIDEO: వార్షికోత్సవ వేడుకకు ఏర్పాటు ముమ్మరం

VIDEO: వార్షికోత్సవ వేడుకకు ఏర్పాటు ముమ్మరం

SRD: నారాయణఖేడ్ మండలం చాప్ట శివారులోని శ్రీ సీమ ఆంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవ వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు బుధవారం ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యహవాచనం, ఆంజనేయ స్వామికి సింధూర లేపనం, మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే అఖండ హరినామ సప్తహం ఈనెల 15 వరకు కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు.