పలు విభాగాలను తనిఖీ చేసిన డీఆర్ఎం

పలు విభాగాలను తనిఖీ చేసిన డీఆర్ఎం

VSP: వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర విశాఖ రైల్వే స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టేషన్‌లో ముఖ్యమైన విభాగాలను పరిశీలించి, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తేవాలని కోరారు. ఆనంతరం టికెట్ చెకింగ్ అధికారుల పడక గదులను పరిశీలించారు. పరిశుభ్రతలో ప్రయాణికుల నుండి మంచి గుర్తింపు పొందాలని సూచించారు.