VIRAL: అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు
TG: నల్లగొండ జిల్లా ఆమనగల్లులో విషాదం జరిగింది. రామలింగేశ్వరస్వామి కల్యాణ ఉత్సవాల్లో భక్తులు పల్లకీని ఊరేగిస్తూ అగ్నిగుండం దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో అదుపుతప్పి పలువురు భక్తులు నిప్పుల్లో పడిపోయారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో 10 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.