రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి
PPM: రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి రేపు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.