అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల ఆందోళన

అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల ఆందోళన

NDL: కొత్తపల్లి మండలం శివపురం, సింగరాజుపల్లె, ముసలమడుగు గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ పంటలకు సాగునీరు అందించే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.