'బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి'
PPM: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సోమవారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఉన్నతాధికారి మురళీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్వతీపురంలో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అలాగే రైతుకు లీటరుకు ఎక్కువ అమౌంట్ వచ్చేటట్లు చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.