మార్కెట్ లేక ఇబ్బంది పడుతున్న మిర్చి రైతులు

GDWL: జిల్లాలో 75,842 ఎకరాల్లో రైతులు ఎండు మిర్చి సాగు చేశారు. నడిగడ్డ ప్రాంతంలో సారవంతమైన నేలలు, సాగునీటి వసతి ఉండడంతో ఎక్కువగా ఎండు మిర్చి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతారు. ఎండుమిర్చి విక్రయించడానికి సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.