VIDEO: మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆందోళన

VIDEO: మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆందోళన

HNK: కాజీపేట మండల కేంద్రంలో నేడు సీపీఎం పార్టీ కార్యకర్తలు గ్రేటర్ మున్సిపాలిటీ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. జిల్లా సీనియర్ నాయకులు చుక్కయ్య ఆధ్వర్యంలో గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించి నిలువ నీడలేని నిరు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.