అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

CTR: పుంగనూరులో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను మంగళవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తనిఖీ చేశారు. సిబ్బంది ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కమిషనర్ అక్కడ భోజనం చేసేవారిని రుచి ఎలా ఉందని అడగడంతో పాటు వారి సలహాలు, సూచనలను తెలుసుకున్నారు.