వందేమాతరం దేశస్ఫూర్తికి ప్రతీక: SP
TPT: వందేమాతరం గేయం 150 ఏళ్ల వేడుకలను తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా SP సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. దేశభక్తితో నిండిన ఈ వేడుకలో SP మాట్లాడుతూ, వందేమాతరం మన దేశ స్ఫూర్తికి ప్రతీక అని తెలిపారు. ప్రతి భారతీయుడు ఈ గేయాన్ని తమ హృదయంలో నిలుపుకోవాలని చెప్పారు.