కాగితాలకే పరిమితమైన .. పాలిథిన్ నిషేధం ..!
NLG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలిథిన్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. నల్లగొండ, మిర్యాలగూడ, వంటి ప్రధాన పట్టణాల్లో పాలిథిన్ వ్యర్థాలు రోడ్ల ప్రక్కన పేరుకుపోతుండటం, నిషేధం కేవలం కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలి స్థానికులు కోరుతున్నారు.