'నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి'

VZM: జామి మండల కేంద్రం స్థానిక నెయ్యిల వీధి జగనన్న కాలనీలో సమస్యలను పరిష్కరించాలని CPI ఆధ్వర్యంలో కాలనీవాసులు శనివారం నిరసన తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ.. కాలనీలో మంచినీరు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం వంటి సౌకర్యాలు లేకపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.