నేడు బోధన్ చేనేత సహకార సంఘం మహాజనసభ
NZB: బోధన్ చేనేత సహకార సంఘం 76వ మహాజన సభను మంగళవారం నిర్వహిస్తున్నట్లు సంఘ మేనేజర్ ఈర్వ నాగరాజు తెలిపారు. సంఘ అధ్యక్షులు మోతుకూరు నారాయణ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు బోధన్ ప్రధాన కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ మహాజన సభలో సంఘానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.