సొసైటీలో మొక్కలు నాటిన ఛైర్మన్

WGL: చెన్నారావుపేట మండలం అమీనాబాద్ సహకార సంఘంలో బుధవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సొసైటీ ఛైర్మన్ మురహర సంఘం ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ వైస్ ఛైర్మన్ పెండ్లి మల్లయ్య, డైరెక్టర్లు ముస్క ఐలయ్య, మల్లాడి వీరారెడ్డి, అనుముల రవి, మాదారపు నరసయ్య అనుమూల యకాంతం పాల్గొన్నారు.