పిజిఆర్ఎస్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ELR: నిడమర్రు MRO కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. ప్రతి ఫిర్యాదును గమనించి, సమన్వయంతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.