VIDEO: 'స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలి'
SRCL: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్స్, స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపల్లి రాజు అన్నారు. సిరిసిల్లలోని చేనేత విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.