ఒడిశా గవర్నర్‌ను కలిసిన శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్
VZM: కొత్తవలస మండలం లోక్ భవనంలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబును, శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ రాపర్తి జగదీష్ బాబు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ట్రస్టు చేపడుతున్న పలు విషయాలను ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు. ట్రస్టు సందర్శనకు ఆహ్వానించినట్లు శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ చెప్పారు. సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.