అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగుల కోసం పోస్టల్ బాలెట్

అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగుల కోసం పోస్టల్ బాలెట్

విజయనగరం: పోస్టల్ బాలెట్ కోసం అత్యవసర సేవలందిస్తున్న శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు, ఎన్నికల విధులలో పాల్గొంటూ పాస్ లు పొందిన మీడియా వారికి ఓటింగ్ కోసం పోస్టల్ బాలెట్ ను అందించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అత్యవసర సేవలను అందించే అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసారు.