సోమశిలలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి
నాగర్ కర్నూల్ జిల్లాలో సినీనటుడు అల్లు అర్జున్ శనివారం సాయంత్రం సందడి చేశారు. కొల్లాపూర్ సమీపంలో ఉన్న సోమశిలలోని వీఐపీ పుష్కర ఘాట్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఏకో టూరిజం ఏర్పాటు చేసిన లాంచ్‌లో ప్రయాణించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. తన అభిమాన నటుడు సోమశిలకు రావడం తెలిసిన అభిమానులు భారీగా తరలివచ్చారు.