పీలేరులో కురుస్తూన్న ఓ మోస్తరు వర్షం

చిత్తూరు: పీలేరులో కురుస్తూన్న ఓ మోస్తరు వర్షంతో ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమారు రెండు మాసాలుగా వేసవి తాపం, ఉక్కపోతతో విలవిల్లాడిన ప్రజలు గురువారం మధ్యాహ్నం వరకు కూడా మాడ్చేసేన ఎండ ఒక్కసారిగా శాంతించి వర్షానికి ఆహ్వానం పలికింది. దాదాపు గంట నుంచి కురుస్తూన్న వర్షంతో.. వాతావరణం చల్లబడ్డంతో స్థానికులు కాస్త సేద తీరుతున్నారు.