భోగాపురంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు

భోగాపురంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు

VZM: భోగాపురం మండలం రాజపులోవ గ్రామంలో ఆదివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 7 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ తెలిపారు. సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.