'మా ఓటు అమ్మబడదు'.. యువకుల వినూత్న ప్రచారం
SDPT: గ్రామపంచాయతీ ఎన్నికల వేళ హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌లో కొందరు యువకులు చేస్తున్న ప్రచారం స్థానికంగా ఆలోచింపజేస్తుంది. 'ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, ఆ ఓటుని మేము అమ్ముకోము. మా ఓటు విలువైనది.. అమ్మబడదు' అని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓటు విలువను ప్రజలకు తెలియజేసేందుకే ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేశామని యువకులు తెలిపారు.