అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్
NZB: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సిరికొండలోని ఏజీ దాస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఒక్కో పథకం వారీగా అధికారులు వివరాలను వెల్లడించడం ద్వారా పథకాల అమలులో పారదర్శకతను చాటారు.