ఆ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోండి

VZM: బొబ్బిలిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బి.సాయికిరణ్ డిమాండ్ చేశారు. బొబ్బిలిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్‌లు నిర్వహించి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అనుమతులు లేని కోచింగ్ సెంటర్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవలన్నారు.