VIDEO: 'అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు'
NGKL: తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాని రచించిన కవి అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరనిలోటని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. లాల్ పేటలోని జయశంకర్ ఇండోర్ స్టేడియంలో అందెశ్రీ భౌతికకాయానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమాజం మొత్తం చల్లగుండాలని తపన పడిన వ్యక్తి అందే శ్రీ అని, ఆయన మరణం బాధాకరమన్నారు.