బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

NLR: సీతారాంపురం-డీజీపేట మార్గం వైపు అదనపు బస్సు ఏర్పాటు చేయాలంటూ పబ్బులేటి పల్లి హైవేపై గ్రామస్తులు, విద్యార్థులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. సీతారాంపురంలోని పలు పాఠశాలు, కళాశాలలో వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రయాణికులకు ఉన్న బస్సు సరిపోక డోర్ల వద్ద వేలాడి ప్రయాణం చేయాల్సి వస్తుందని వాపోయారు. మరో అదనపు బస్సు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.