చిత్రకళ ప్రదర్శన సంస్కృతికి ప్రతిబింబం

చిత్రకళ ప్రదర్శన సంస్కృతికి ప్రతిబింబం

NTR: తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రకళా ప్రదర్శన ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగా ఆదివారం విజయవాడలో ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ ఆధ్వర్యంలో మన సంస్కృతి చిత్రకళ ప్రదర్శన జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. చిన్ననాటి పండుగలు, సంస్కృతులను నేటి తరానికి తెలియజేసేలా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు.