'రౌడీ జనార్ధన' కోసం స్పెషల్ ఎపిసోడ్..?

'రౌడీ జనార్ధన' కోసం స్పెషల్ ఎపిసోడ్..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తోన్న మూవీ 'రౌడీ జనార్ధన'. ఈ సినిమా సెకండాఫ్‌లో ఓ స్పెషల్ ఎపిసోడ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారట. ముంబై‌లో ఈ ఎపిసోడ్ షూట్ జరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన షెడ్యూల్‌లో ఈ ఎపిసోడ్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలను షూట్ చేశారట. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.