మార్కాపురంలో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభ్యం.!
ప్రకాశం: మార్కాపురం ఏకలవ్య కాలనీలో నివాసముంటున్న చింతగుంట్ల నరేష్(14) రెండు రోజులక్రితం నుంచి కనబడడంలేదని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇవాళ సుమారు 12:30 సమయంలో మార్కాపురం నుంచి ఒంగోలుకి వెళ్లే బస్సులో ఉన్నాడని సమాచారం వచ్చింది. అ బ్బాయికి సంబంధించిన బంధుమిత్రులు వెళ్లి అబ్బాయిని ఇంటికి తీసుకొని వచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.