విజయనగరంలో ‘జయహో జనయిత్రి’ ర్యాలీ
VZM: మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది ‘జయహో జనయిత్రి’ మహిళా సాధికార ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఏఎస్పీ సౌమ్యలత ఈ ర్యాలీను ప్రారంభించారు. ఈ ర్యాలీ ద్వారా మహిళల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అవగాహన, సమాన హక్కులు మరియు మహిళా సాధికారతపై ప్రజల్లో చైతన్యం కల్పించారు.