VIDEO: తిరుమల పవిత్రత పరిరక్షణకు వైసీపీ నిరసన
VSP: తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు విశాఖపట్నంలో నిరసన చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 49వ వార్డులోని శ్రీ వైభవ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కేకే రాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.