VIDEO: 'అంగవైకల్యం అడ్డంకి కాదు.. సంకల్పమే శక్తి'
KRNL: దేవనకొండకు చెందిన మాదేవి అంగవైకల్యంతో ఉన్నప్పటికీ జీవితంపై ఆశలు కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగుతోంది. ఇతరులపై ఆధారపడకుండా చిన్న కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని స్వశక్తితో జీవనం సాగిస్తోంది. ప్రతిరోజూ దుకాణం నిర్వహిస్తూ కుటుంబ అవసరాలను తానే చూసుకుంటోంది. కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.