డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన వీర్రాజు
కోనసీమ: ఆలమూరు మండల సచివాలయ ఉద్యోగుల విభాగంలో డిప్యూటీ ఎంపీడీవోగా ఎస్ వీర్రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీ ఉద్యోగుల పదోన్నతులలో భాగంగా గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రెటరీగా ఆలమూరు మండలం సంధిపూడి లో పనిచేస్తుండగా వీర్రాజుకు డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి లభించింది. దీనిలో భాగంగా సోమవారం పదోన్నతి పొందిన కాపీని ఎంపీడీవోకి అందజేసి విధుల్లో చేరారు.