VIDEO: రోడ్లపై ధాన్యం అరబోత.. ప్రయాణికుల ఇబ్బందులు
WGL: గీసుకొండ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు తమ ధాన్యాన్ని రోడ్డుమీద ఆరబోస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చిన్నగా ఉండటం, దానికి తోడు రోడ్డులో సగభాగం ధాన్యం ఆరబోయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. అలాగే, ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ధాన్యాన్ని కళ్లంలో ఆరబెట్టేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.