ఉయ్యూరు రైతు బజార్‌లో కూరగాయల ధరలు

ఉయ్యూరు రైతు బజార్‌లో కూరగాయల ధరలు

కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్‌లో మంగళవారం అధికారులు కూరగాయల ధరలు ప్రకటించారు. సాధారణ కూరగాయలు తక్కువ రేట్లలో లభిస్తున్నప్పటికీ కొన్ని మాత్రం ఎక్కువ ధరలకే అమ్ముడవుతున్నాయి. దోసకాయ రూ.18, వంకాయ రూ.32, ఉల్లిపాయలు రూ.26, దొండకాయలు రూ.32, బెండకాయలు రూ.30, బంగాళాదుంప రూ.29గా ఉన్నాయి. బీరకాయ రూ.36, టమాటా రూ.35, క్యారెట్ రూ.49, కాప్సికం రూ.70గా ఉన్నాయి.