కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం

కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం

GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ సత్యం మార్చి 6న మరణించారు. ఆయన జై నడిగడ్డ యువతలో సభ్యుడిగా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుటుంబ పరిస్థితిని గమనించిన సంఘ సభ్యులు ఇవాళ రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. పిల్లల చదువుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామస్థులు వారి సేవను అభినందించారు.