పొన్నూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

పొన్నూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

GNTR: పొన్నూరు పట్టణ, మండల పరిధిలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షానికి పట్టణంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాదచారులు, వాహనదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడగా, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారాయి.