నడిగూడెంలో లార్వ నిర్మూలన చర్యలు

SRPT: నడిగూడెం మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, నీరు నిలువ ఉండడం వలన దోమలు పుట్టే అవకాశం ఉండడంతో, నీరు నిలువ ప్రాంతాలలో దోమల లార్వాను నాశనం చేసే తీమోఫాస్ ను, గ్రామ పంచాయితీ కార్యదర్శి ఉమారెడ్డి ఇవాళ స్ప్రే చేయించారు. దీనివలన దోమల పుట్టుకను నిరోధించడం జరుగుతుందని ఆమె తెలిపారు.