రామరాజ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: చింతమనేని

రామరాజ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: చింతమనేని

ELR: ప్రజలందరికీ సుభిక్షాన్ని అందించిన రామరాజ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని పానకం నిమిత్తం దెందులూరు నియోజకవర్గంలోని దాదాపు 450పైగా రామాలయాలకు సుమారు 7,500 కేజీల బెల్లం దిమ్మెలను కానుకగా గురువారం పంపిణీ చేశారు. అన్ని వర్గాలు అన్ని మతాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అన్నారు.