విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

GDWL: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ గట్టు మండలంలో శుక్రవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో అమరులైన యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశ భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఏకమవాలని పిలుపునిచ్చారు.