VIDEO: గాలివాన బీభత్సం.. కూలిన హోర్డింగ్

GDWL: జిల్లాలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పట్టణంలోని పలు కాలనీల్లో చెట్లు విరిగిపడగా, వ్యాపార సంస్థల హోర్డింగులు నేలకొరిగాయి. శేరెల్లి వీధిలో చెట్టు విరిగిపడగా, రాజీవ్ మార్గ్‌లో జయశ్రీ బార్ అండ్ రెస్టారెంట్ హోర్డింగ్ గాలివాన ధాటికి కొట్టుకుపోయింది. అయిజ-గద్వాల రోడ్డులో భారీ వృక్షం కూలడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.