బాపట్లలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

బాపట్లలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

BPT: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రూ.14,70,616 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను 25 మంది లబ్ధిదారులకు అందజేశారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అండగా నిలవడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు సీఎం సహాయ నిధి పెద్ద మద్దతు అవుతుందని పేర్కొన్నారు.