కార్తీక పౌర్ణమి.. కొబ్బరికాయ ధరలకు రెక్కలు

కార్తీక పౌర్ణమి.. కొబ్బరికాయ ధరలకు రెక్కలు

AKP: నర్సీపట్నంలో కొబ్బరికాయ ధరలకు రెక్కలు వచ్చాయి. కార్తిక మాసం పురస్కరించుకొని పలువురు భక్తులు పూజలు చేస్తున్న నేపథ్యంలో కొబ్బరికాయల వ్యాపారస్తులు ధరలు అమాంతం పెంచేశారు. బుధవారం ఉదయం కొబ్బరికాయ ఒకటి రూ. 50 ధర పలికింది. పెరిగిన ధరలు నేపథ్యంలో పలువురు అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, సాధారణ భక్తులు సైతం అదే ధరకు కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.