'విద్యుత్ వినియోగదారుల దినోత్సవం'
MDK: రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన వినియోగదారుల దినోత్సవంలో వినియోగదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించినట్లు విద్యుత్ AE ఆదయ్య తెలిపారు. రామాయంపేట సబ్ డివిజన్ పరిధిలో రామాయంపేటలో 6, నార్సింగి 4, నిజాంపేట, 1, చేగుంటలో1 మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయని వాటిని త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.