తరగతి గదే వంటగది అయ్యింది..!

ADB: తలమడుగు మండలం నందిగామ గిరిజన పాఠశాలలో వంటగది లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 36 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, వంటగది లేక అవస్థలు పడుతున్నారు. తరగతి గదిలోనే ఓ మూలన వంటలు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోంది. ఐటీడీఏ పీవో, అధికారులు చొరవ తీసుకుని వంటగది నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.