ఈ నెల 10న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
KDP: ఈ నెల 10వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్టీయూ మైదుకూరు రీజియన్ కన్వీనర్ రమణయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్థికపరమైన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ ధర్నాను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.