ధోనీ ఐకానిక్ ఫొటో రీక్రియేట్ చేసిన హర్మన్
2025 వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ట్రోఫీతో ముంబైలోని 'గేట్ వే ఆఫ్ ఇండియా' వద్ద ఫొటో దిగింది. సరిగ్గా 2011లో ప్రపంచకప్ గెలిచిన తరువాత MS ధోనీ కూడా ట్రోఫీతో అదే చారిత్రక కట్టడం ముందు ఫొటో దిగాడు. దీంతో ఈ రెండు ఫొటోలను కలిపి అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.