నల్లరాళ్లపల్లి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

నల్లరాళ్లపల్లి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

CTR: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజల్లుతున్న నల్లరాళ్లపల్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుంగనూరు మండలం కృష్ణ రెడ్డి పల్లి మార్గంలో కొలువైయున్న పురాతన అమ్మవారి ఆలయంలో మంగళవారం సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో మహిళలు దీపాలు వెలిగించి అంబిలిని సమర్పించారు.